* కష్టేఫలికి నిదర్శనం చిరంజీవి
* ఎన్నో పురస్కారాలు ఆయనకు దాసోహం
* నేడు మరో అత్యున్నత గౌరవం
* యూకే పార్లమెంట్లో సత్కారం
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ :
పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. సినీరంగంలోనే కాదు రాజకీయ, సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఇటీవల బంపర్ హిట్ అందుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో.. నా పేరు రికార్డుల్లో ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులుంటాయి… అని ఆయన చెప్పిన డైలాగు అక్షర సత్యం. రికార్డులు, అవార్డులు, రివార్డులు.. ఆయన సొంతం. బ్రేక్ డ్యాన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసి సినీరంగంలో తనకు తిరుగులేదని ఏనాడో నిరూపించుకున్న చిరంజీవి.. నేటికీ అన్నింటా ముందు వరుసలోనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పరాయి దేశం పార్లమెంట్‌లోనూ మెగాస్టార్‌కు అరుదైన సత్కారం లభించబోతుంది. సినీ రంగానికి నాలుగు దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవలకు గానూ, యూకే పార్లమెంట్ లో ఆయనను మార్చి 19న అంటే ఈరోజు ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సాధించిన ఘనతల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
* పాన్ ఇండియా స్టార్లుగా ఇటీవల కొందరు గుర్తింపు పొందుతున్నారు. 1990ల్లోనే అంతర్జాతీయంగా చిరంజీవికి పేరుంది. ఆయన నటించిన ‘స్వయంకృషి’ నిమా వీ రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా పేరొందింది.
* ‘ఆస్కార్’ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనే ఆహ్వానం 1987లోనే అందుకున్నారు.
* ‘పసివాడి ప్రాణం’ సినిమాతో బ్రేక్ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
* ఏక పాత్రాభినయం, ద్విపాత్రాభినయం అలాగే త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన రికార్డు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి పేరిట ఉంది.
* 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.
* 1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా చిరు పేరొందారు.
* సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్(రూ.కోటికి పైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లోనే ఆయన రికార్డుకెక్కారు.
* వ్యక్తిగతంగా వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి. ఆయన గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ అనే సైట్ అందుబాటులో ఉంది.
* డాన్సుల్లో గిన్నీస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో చిరు తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో.. 537 పాటల్లో.. 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి.
* దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మ విభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది.
* ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.
* తాజాగా యుకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీస్ నుంచి నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు. మరో ఇదే వేదికపై బ్రిడ్జి ఇండియా సంస్థ చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించనుంది.
…………………………….
