
* “మైసా”లో వినూత్నమైన లుక్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న.. రక్తసిక్తమైన ముఖంతో రౌద్రంగా కనిపించారు. అదే ఆమె తాజా చిత్రం “మైసా” (MYSA ) పోస్టర్ లో. నిర్మాతలు పోస్టర్ ను, టైటిల్ ను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఆమె వినూత్నంగా కనిపించారు. “ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి.. !” అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ ఆ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. పోస్టర్ ను చూస్తే రష్మిక (RASHMIKA) వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై ఐదు భాషలలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్ట్ లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి మరింత ఆసక్తిని పెంచారు. ఇటీవలే పుష్ప 2, ఛావా, సికందర్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుబేర (KUBERA) సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. కొత్త మూవీలో కూడా సరికొత్త పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతోంది.
………………………………………………………