* వైఎస్ ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించండి
* వైఎస్ విజయలక్ష్మి విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల ప్రచార గడువు కాసేపట్లో ముగుస్తున్నందనగా వైఎస్ విజయమ్మ ఓ వీడియో విడుదల చేశారు. కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలను గెలిపించాలని సందేశం పంపారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా విదేశాల్లో ఉంటున్న విజయమ్మ ఇప్పుడీ వీడియో విడుదల చేయడం ఆసక్తిగా మారింంది. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తోందని…. ఆమెను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నా అని తెలిపారు. ‘‘కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’’ అని విజ్ఞప్తి చేశారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
