* ప్రాణాలతో బయటపడ్డ మహ్మాద్ షోయబ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సౌదీలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారిని గుర్తించారు. సీటిలోని మల్లేపల్లి బజార్ఘాట్ఖు చెందిన వారిగా ప్రకటించారు. ప్రమాదంలో రహీమున్నీసా, రహత్ బీ, షేహనాబ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీగా గుర్తించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వివరాలకోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. నవంబర్ 9న హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్లినట్లు తెలిసింది. హైదరాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహ్మాద్ షోయబ్ అనే వ్యక్తి ఒకరే ప్రాణాలతో బయటపడ్డట్లు ప్రకటించారు. మృతుల వివరాలు అధికారులు వెల్లడించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
…………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
