* ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు కేసులు నమోదు
* క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల భవిష్యత్ అంధకారం అవుతుంది.
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హైదరాబాద్ సీపీ సజ్జనర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలోప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని సజ్జనర్ తెలిపారు. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విీసీ సజ్జనర్ సామాజిక వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని సజ్జనర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసే ముందే గుర్తుంచుకోవాలని,ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి. క్షణికావేశంలో ఏ చిన్నతప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తుందని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
