ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడిరది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు వెల్లడిరచారు. ఈ నెల 19తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేయడం జరిగింది. ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్లు సమాచారం. ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నట్లు సమాచారం.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
