* హైదరాబాద్ FSL అగ్నిప్రమాదం…
* 1100 కీలక ఫైళ్లు దగ్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టానికే పరిమితం కాకుండా, వందలాది క్రిమినల్ కేసుల దర్యాప్తుపై కోలుకోలేని దెబ్బ తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపేందుకు వచ్చిన నాగ్పూర్ ప్రత్యేక నిపుణుల బృందం, ప్రాథమిక నివేదికలో విస్తుపోయే గణాంకాలను వెల్లడించింది. సుమారు 1100 కీలక దస్త్రాలు (Files) మంటల్లో పూర్తిగా బూడిదైనట్లు బృందం గుర్తించింది. దగ్ధమైన ఫైళ్లలో ఉన్న డేటాను తిరిగి సేకరించేందుకు (Data Recovery) సాంకేతిక బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ, అది సాధ్యం కాకపోవచ్చని తేల్చిచెప్పింది. ఈ ఫైళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కీలక కేసుల ఫోరెన్సిక్ రిపోర్టులు, ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఇవి మాయమవ్వడం వల్ల అనేక కేసుల విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ ఘటనను ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటి? అనే కోణంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కీలక కార్యాలయాల్లో డిజిటల్ బ్యాకప్ మరియు అగ్నిమాపక భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
