సిగ్గుపడ్డ రోజు నుంచి..
గర్వపడే రోజుకు వచ్చాం
.. గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపాలిటీ చైర్మన్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
నీతో కలిసి పని చేసి సిగ్గుపడ్డ రోజుల నుండి గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజుకు చేరుకున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ లు ఎద్దేవ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబం పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేసిన వ్యక్తిగత ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. స్థానికుడని 10 ఏళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిని విస్మరించి పదవులు, పనులను అమ్ముకోవడమే కాకుండా మహిళలను అవమానించే విధంగా వ్యవహరించి నియోజకవర్గ ప్రజలు తల దించుకునే విధంగా వ్యవహరించిన నీతో కలిసి పనిచేసిన మాకు తెలుసు అన్నారు.15 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉన్న గెలిచిన రెండేళ్లలో దాదాపు 1600 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన మా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆయన కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీది కాదని ధ్వజమెత్తారు. పదేళ్లు ఎమ్మెల్యేగా వెలగబెట్టిన మీకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దయాకర్ రావు, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ఇన్చార్జులుగా వస్తున్నారంటే నీ స్థాయి ఏంటో ? ఎక్కడుందో ? అర్థం చేసుకోలేని స్థాయిలో నువ్వు ఉండడం మాకు జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు. నీ వ్యవహార శైలి, నీ రాసలీలలతో తలెత్తుకోలేని రోజుల నుండి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హయాంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా, అభివృద్ధికి కేరాఫ్ గా తలెత్తుకుని తిరిగే స్థాయికి చేరామన్నారు. అహర్నిశలు ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కడియం శ్రీహరిని విమర్శిస్తే ఇకపై సహించేది లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి కడియం ను ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం మానుకోవాలని హిత బోధ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు బొల్లు లక్ష్మి, కృష్ణవేణి, గట్టు రమేష్, హరినాథ్, సంపత్ రాజ్, కృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ చందర్ రెడ్డి, బుర్ల శంకర్, కొలిపాక సతీష్, ఇంద్రారెడ్డి, సింగపురం దయాకర్, కోళ్ల రవి, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ
