Pawan kalyan
* హాట్ టాపిక్‌గా జనసేనాని
* ఏపీ ఎన్నికల్లో వంద శాతం సక్సెస్
ఆకేరు న్యూస్, విజయవాడ :
‘‘జగన్.. గుర్తుపెట్టుకో.. నిన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే ( Pawan kalyan ) కాదు.. మా పార్టీ జనసేనే కాదు..’’ జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘోర ఓటమి చెందడంతో ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పవన్ చెప్పినట్లు నిజంగానే వైసీపీ అథఃపాతానికి వెళ్లిపోయింది. పట్టుమని పది సీట్లు కూడా పొందలేకపోయింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. మంత్రుల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు తప్ప అందరూ ఓడిపోయారు. వైసీపీ ఇంతటి ఘోర పరాభవంలో పవన్ పాత్ర కీలకంగా మారిందని జన సేన నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటమి నుంచి ఎన్నో పాఠాలు
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కి ఘోర పరాభవం ఎదురైంది. ఒకే ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. అన్నింటికీ మించి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్‌కి రెండు స్థానాల్లోనూ ఓటమి ఎదురైంది. సినిమాల్లో తిరుగులేని క్రేజ్, స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఇలాంటి ఓటమి ఎదురైన తర్వాత.. మనకెందుకీ రాజకీయాలు అని అనుకోలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. మరెన్నో కష్టాలను అనుభవించాడు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఏసీ గదుల్లో అన్ని వసతులు ఉన్న వ్యానిటీ వ్యానులో రాజభోగాలు అనుభవించే పవన్ కళ్యాణ్, ఎన్నో రాజకీయ కష్టాలను ఎదుర్కొన్నాడు . ఆ కష్టాలకు ఫలితం ఎట్టకేలకు దక్కింది.
పవన్ పాత్ర కీలకం
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడంలో పవన్ క్రియా శీలక పాత్ర పోషించారని అందరూ చెబుతున్నారు. . తన బలాబలాలను పట్టించుకోకుండా కూటమిని కలిసికట్టుగా ఉంచడమే ధ్యేయం ముందుకు సాగారు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడానికి అవసరమైన సందర్భాల్లో తాను తగ్గాడు. 21 సీట్లకే పరిమితం అయ్యాడు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామో కాదు.. ఎన్ని స్థానాల్లో గెలిచామో ముఖ్యమని చాటిచెబుతూ వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నాడు. 21కు 21 అసెంబ్లీ స్థానాలు, రెండుకు రెండు లీడ్‌లో ఉన్నాయి. ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి వంద శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. అత్యధిక మెజార్టీతో తాను గెలవడమే కాకుండా, తన అభ్యర్థులు అందరినీ గెలిపించుకున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్.. అని పేరు పొందారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవర్ఫుల్ స్టార్‌గా మారారని ఆంధ్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
