Vijay Campaign Viral Incident
* ఎన్నికల వేళ తమిళనాట ఆసక్తికర దృశ్యం
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికల ప్రచార వేళ అభ్యర్థుల చిత్ర విచిత్ర విన్యాసాలు సర్వ సాధారణమే.. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు పడే కష్టాలు వర్ణణాతీతం.. పిల్లవాడిని ఆడించడం.. లాలించడం నుంచి రోడ్డు మీద గ్యా రెలు, బూరెలు వండే వరకు నవరసాలను పండిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు చేసే ఫీట్లు కొన్ని వారికి ప్రజలను చేరువ చేస్తే మరికొన్నిటి వల్ల నవ్యుల పాలవుతారు. అదే తరహాలో తమిళగ వెట్రి కళగం పార్టీ ( TVK ) అధినేత సినీ హీరో విజయ్ ( Vijay ) సైకిల్ సవారీ కూడా నవ్వుల పాలయింది. కారవాన్ , ఇతర వాహనాలు విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రాగా సినీ స్టయిల్లో స్టయిలిస్ గా సైకిల్ తొక్కుతూ తన వాహనం ముందు అభిమానుల హర్షాతిరేకాల మద్య గాలిలో చేయి ఊపుతూ కదులుతున్నాడు.. ఇదే సమయంలో కొంత మంది అభిమానులు ఉత్సాహంగా విజయ్ వస్తున్న దారిలో పూలు చల్లుతున్నారు.. ఇంతలో ఒక వీరాభిమాని మాత్రం ఏకంగా పూల గుత్తి ( Flower Boquet )ని నాజూగ్గా విజయ్ వైపు విసిరేశాడు.. ఒక్క సారిగా ఏమనుకున్నాడో ఏమో .. ఒక దెబ్బకు సైకిల్ దిగి పరుగు.. పరుగున వ్యాన్లోకి వెళ్ళి పోయాడు.. పూల గుత్తిని బాంబనుకున్నాడా.. ఇంకా ఏదైనా ప్రమాదం ఎదురొచ్చిందనుకున్నాడో ఏమో.. సైకిల్ సవారి ని మాత్రం ఆపేశాడు.. అక్కడున్న వాళ్ళంత ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయారు.. కొద్ది సేపు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.. ఆ తర్వాత పూలగుత్తి అని తెలిసిన తర్వాత హాయిగా ఊపరి పీల్చుకున్నారు అక్కడి జనం.. ఈ వీడియో ఇపుడు నెట్టింట తెగ వైరల్ ( Viral Video ) అవుతోంది..
* రీల్ హీరో .. రియల్ హీరో టాక్ ఆఫ్ ద తమిళ నాడు
ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఆయనలో ఒక ‘లార్జర్ దన్ లైఫ్’ (Larger than life) ఇమేజ్ను వెతుకుతారు. తెరపై వందల మందిని ఎదుర్కొనే నాయకుడు, నిజ జీవితంలో కూడా మరీ అంత కాక పోయినా ఎంతో కొంత హీరోయిజం ఉండాలని భావిస్తారు.. దీనికి భిన్నంగా రాజీకీయ నాయకుడిగా మారిన సినీ హీరో విజయ్ ఒక పూల గుత్తికి స్పందించిన తీరు చర్చనీయాంశమవుతోంది.
సినిమా స్టార్లకు ఉండే అతిపెద్ద బలం వారి ‘మాస్ ఇమేజ్’ ( Mass Image ) అభిమానులు తమ నాయకుడిని అత్యంత ధైర్యవంతుడిగా చూడాలనుకుంటారు. పూల గుత్తి విసిరినప్పుడు కళ్ళెత్తి చూడకుండా లేదా దాన్ని స్వీకరిస్తూ హుందాగా వెళ్లాల్సింది పోయి, పరుగు తీయడం అనేది ఆ ‘హీరోయిజం’ పై నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఇది సామాన్య ప్రజల్లో “తెరపై కనిపించే ధైర్యానికి, నిజ జీవితానికి ఇంత తేడా ఉందా?” అనే సందేహాన్ని కలిగిస్తుంది.ప్రజా క్షేత్రంలో కి వెళ్ళినప్పుడు పూల దండలు, గుత్తులు, ఒక్కోసారి తోపులాటలు సహజం. ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదరవ్వడం సర్వ సాధారణమే .. వాటిని సమయస్పూర్తితో చిరునవ్వు చెదరకుండా ఎదుర్కోవడమే నాయకుడి లక్షణంగా భావిస్తారు. ఇంత చిన్న విషయానికే ఇలా స్పందిస్తే, రేపు ప్రత్యర్థుల నుండి వచ్చే రాజకీయ దాడులను ఎలా తట్టుకుంటారు?” అనే ఆందోళన పార్టీ కేడర్లో సహజంగానే కలుగుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
* గుండె నిబ్బరమే ఆ నేతల ఆయుధం
తమిళనాడు రాజకీయాల్లో కామరాజ్ నాడార్ ( Kamaraj Nadar ) నుంచి మొదలు ఎంజీఆర్ (MGR) , కరుణానిధి ( Karuna nidho ) జయలలిత ( Jayalalitha ) స్టాలిన్ ( Stalin ) లాంటి రాజకీయ నాయకులు గుండె నిబ్బరమే ఆయుధంగా సమర్థులైన రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఉన్నప్పుడు అత్యంత నిబ్బరంగా కనిపించాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లు, ధైర్యవంతుడైన నాయకుడిని ఇష్టపడతారు. విజయ్ పూల గుత్తి ‘పరుగు’ ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉంది. సినిమాల్లో చూసే విజయ్ కి , రాజకీయాల్లో కనిపిస్తున్న విజయ్ కి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఆయన రాజకీయ భవిష్యత్తుపై, ముఖ్యంగా ఓటర్ల నమ్మకంపై ప్రభావం చూపే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ప్రత్యర్థులకు సాఫ్ట్ టార్గెట్గా మారి పూల గుత్తి – పరుగు బలమైన విమర్శనాస్త్రం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడిగా విజయ్ తన పబ్లిక్ అప్పీయరెన్స్ను మరింత రాటుదేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ వ్యూహకర్త ఒకరు అభిప్రాయ పడ్డారు. గతంలో ఒక విమాన ప్రమాద సమయంలో అందులో ఉన్న తెలుగు సినీ హీరో ఒకరు సామాన్య ప్రయాణికులకంటే ప్రాణ భయంతో అరిచిన సంఘటనను ఆయన గుర్తు చేశారు.. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి సక్సెస్ కాకపోవడం గమనార్హం ..
===================

1 thought on “ACTOR VIJAY THALAPATHY | పూల గుత్తి విసిరిన అభిమాని”