Father Christa Thomas Mass station ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నిర్మల మాత దేవాలయం లో నూతన గురువుగా రెవ.ఫాదర్ తాటికొండ క్రీస్తా థామస్ మొదటి దివ్యభలి పూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఫాదర్ క్రీస్తా థామస్ కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దివ్యభలి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్లు తాటికొండ మధు, బలగాని అనిల్, పొన్న రాజేష్ నాయకులు మరపల్లి ప్రసాద్, శీలం శ్యామ్, జబ్బర్, ఆకారపు అశోక్ విచారణ గురువులు ఆగస్టిన్ రెడ్డి, తాటికొండ జోసెఫ్, నిర్వాహకులు తాటికొండ అనిత, పర్య వేక్షణ తాటికొండ సురేష్, మేడ సుష్మ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫాదర్స్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
