Gade Innayya Interim Bail
అకేరు న్యూస్, డెస్క్ : జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నా తెలంగాణా ప్రజాప్రంట్ ప్రతినిధి, హక్కుల నాయకుడు గాదె ఇన్నయ్య కు నాంపల్లి కోర్ట్ లో భారీ ఊరట లభించింది.
మావోయిస్టులతో సంబంధాలు, యూఏపీఏ (UAPA) కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి అంత్యక్రియల సభలో ప్రసంగించి, ప్రభుత్వ భద్రతా బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆయనను, జనగామ జిల్లా జఫర్గఢ్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
