HANAMKONDA FAKE DOCTOR BUSTED
* హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దాడి…
అకేరు న్యూస్, హన్మకొండ : హన్మకొండ జిల్లాలోని ఏనుగులగడ్డ ప్రాంతంలో నకిలీ వైద్యుల ఆగడాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు నిర్వహించారు. సరైన అర్హతలు, లైసెన్సులు లేకుండా ఇష్టానుసారంగా క్లినిక్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుపుతున్న వారిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఈ నకిలీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నకిలీ వైద్యం అనధికారిక క్లినిక్‌ల మోసాల బారిన పడకుండా అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తం 41 రకాల మందులు, అందులో 35 రకాల ఇన్స్టిట్యూషనల్ సప్లై మందులు గుర్తించారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.10,000 ఉంటుందని అధికారులు తెలిపారు.
క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ హెచ్చరించారు. మందుల నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపారు.
కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ వెల్లడించారు. లైసెన్స్ లేని వ్యక్తులు, షాపులకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
