Kadiyam Srihari Development Works
* ప్రభుత్వ చిత్తశుద్ధికి సంక్షేమ పథకాలే నిదర్శనం
* దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పేద ప్రజల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి సంక్షేమ పథకాలే నిదర్శనం, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రంగరాయ గూడెం, ఇప్పగూడెం గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లను ప్రారంభించి పలు లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా రంగరాయగూడెంలో 33.48 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు, మహిళా భవనం, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంతో పాటు 8 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణి చేశారు. అలాగే ఇప్పగూడెం గ్రామంలో కోటి 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవం, కోటి 23 లక్షల కుడా నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంతో పాటు 40 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధిని చాటుకుంటుందని తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చుస్తే చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎం ఓరంగబెట్టారో మీ అందరికీ తెలుసని అన్నారు. పని చేయని వారు, పైసకు కోరగాని వారే ఎక్కువగా మాట్లాడుతారని విమర్శించారు. తాగి, తిని తిరిగే వారు ఎవరో నిజాయితీగా పని చేసే వారు ఎవరో ప్రజలు గమనించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి మీరందరు సహకరిస్తే ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాదని వెల్లడించారు.
కడియం శ్రీహరి అంటేనే అభివృద్ధి అని చెప్పుకునే విధంగా చేసి చూపెడుతానని స్పష్టం చేశారు. రంగరాయగూడెం గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే గ్రామంలో కోటి 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షలు, రంగరాయగూడెం నుండి కాషాగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి అతి త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో సైతం అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మొదటి విడతలో 19 ఇందిరమ్మ ఇండ్లుమంజూరు చేశానని, ప్రస్తుతం మరో 8 మందికి మంజూరు పత్రాలు పంపిణి చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పగూడెం గ్రామం రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం అని తెలిపారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పగూడెం గ్రామానికి మొదటి విడతలో 54 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు, ఇప్పుడు మళ్ళీ 49 మందికి మంజూరు పత్రాలను పంపిణి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో 4 కోట్ల 70 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, కోటి 10 లక్షలతో సిసి రోడ్లు, కోటి 23 లక్షల కుడా నిధులతో మరో సిసి రోడ్డు నిర్మాణం మొత్తం దాదాపు 7 కోట్ల అభివృద్ధి పనులను ఒక్క ఇప్పగూడెం గ్రామంలోనే చేపట్టినట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో మరో 5 కోట్ల నిధులు ఇప్పగూడెం గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

నెల రోజుల్లో ముదిరాజ్, ఎస్సి కమ్యూనిటీ హళ్లకు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి అమృత నాయక్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య, ఇప్పగూడెం సర్పంచ్ మందపురం రాణి అనిల్, రంగరాయ గూడెం సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ఉప సర్పంచులు నరసయ్య, లింగన బోయిన రాజు, హౌసింగ్ ఏఈ అఖిల నాయకులు ఇనుగాల వెంకటేశ్వర రెడ్డి, నెలమంచ అజయ్, తోట వెంకన్న, బూర్ల శంకర్, రాపోలు మధుసూదన్ రెడ్డి, నీల గట్టయ్య, మాజీ సర్పంచ్ కట్టయ్య, పంచాయతీ రాజ్, హౌసింగ్ శాఖ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
