TGNPDCL CMD Karnati Varun Reddy reviewed indoor substation works
* మెరుగైన విద్యుత్ సరఫరానే లక్ష్యం!
* టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో వేగంగా ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం
* పట్టణాల్లో విద్యుత్ అంతరాయాలకు అడ్డుకట్ట – సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
అకేరు న్యూస్ హన్మకొండ :పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న స్థలాభావం (భూసౌకర్యాల కొరత) సమస్యను అధిగమిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ఇండోర్ సబ్స్టేషన్లు ఎంతగానో దోహదపడతాయని టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ టౌన్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి కాలనీ , ఆర్&బి క్వార్టర్స్ ప్రాంతాలలో నూతన ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు .
*నిరంతరం విద్యుత్ సరఫరా లక్ష్యం
ఇండోర్ సబ్‌స్టేషన్ పనులను అత్యంత ప్రాధాన్యతతో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఆధికారులకు సూచించారు . వినియోగదారులకు మెరుగైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .
అదేవిధంగా, అన్ని డీటీఆర్లు విద్యుత్ లైన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి,లైన్ల నిర్వహణ చేపట్టి, లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్థ పరిధిలోని పలు జిల్లాల్లో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.
* ఇండోర్ సబ్స్టేషన్ల వల్ల కలిగే ప్రయోజనాలు
పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత సమస్య పూర్తిగా తీరుతుంది.
విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేని, మెరుగైన సరఫరా అందుతుంది.
లోడ్ నిర్వహణ (Load Management) సులభతరమవుతుంది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ఇండోర్ సబ్స్టేషన్ల ద్వారా పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని సీఎండీ వరుణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎస్ఈ బి. సామ్య నాయక్ , హన్మకొండ టౌన్ డి .ఈ ఆపరేషన్ జి . సాంబారెడ్డి , డి .ఈ MRT ఐ .విజేయేందర్ రెడ్డి , డి .ఈ టెక్నికల్ భాస్కర్, ఈ ఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఏ.డీఈ సివిల్ హుస్సేన్ , ఏ .ఈ సివిల్ తదితరులు పాల్గొన్నారు .
Please tell us what is wrong. Your report will be sent to the website team.
