Peddamma Temple Road Cleared
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్లులో
పెద్దమ్మ గుడికి వెళ్లే దారిలో ఉన్న ముళ్లపోదాలతో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని తెలియడంతో 7వ వార్డ్ కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్ జెసిబి ద్వారా ముల్ల చెట్లను తొలగించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు బూర్ల కుమార్, అన్నెపు అనిల్, ముదిరాజ్ మత్స్యశాఖ కమిటీ అధ్యక్షులు అన్నెపు కుమార్, కమిటీ సభ్యులు. బూర్ల సమ్మయ్య, శాగ నరేష్, యట యాదగిరి, గుడి అధ్యక్షులు బూర్ల ప్రవీణ్ , బూర్ల ఎల్లయ్య పాల్గొన్నారు.
