FIFA World Cup 2026 semi finals
* మెస్సీ Vs కేన్.. ఎంబాప్పే Vs యమాల్..
* ఫుట్‌బాల్ అభిమానులకు డబుల్ ట్రీట్
ఆకేరు న్యూస్, డెస్క్:
ఫిఫా వరల్డ్ కప్ 2026 మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ ముగియడంతో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి.
అర్జెంటీనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ తుది నాలుగు జట్లుగా నిలవగా.. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ పోరులకు రంగం సిద్ధమైంది.
ఒకవైపు కైలియన్ ఎంబాప్పే నేతృత్వంలోని ఫ్రాన్స్‌కు.. యువ సంచలనం లామిన్ యమాల్‌తో స్పెయిన్ సవాల్ విసరనుండగా.. మరోవైపు లియోనెల్ మెస్సీ అర్జెంటీనాకు.. హ్యారీ కేన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఎదురుకానుంది.
* సెమీఫైనల్ షెడ్యూల్
ఫ్రాన్స్ Vs స్పెయిన్
* తేదీ: జూలై 15
* సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు
* వేదిక: డల్లాస్ స్టేడియం, ఆర్లింగ్టన్
ఇంగ్లండ్ Vs అర్జెంటీనా
* తేదీ: జూలై 16
* సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు
* వేదిక: అట్లాంటా స్టేడియం
ఫైనల్ మ్యాచ్ జూలై 20న భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు జరగనుంది.
* ఫ్రాన్స్.. డిఫెన్స్‌లో అద్భుతం
నాకౌట్ దశలో ఫ్రాన్స్ ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా సెమీఫైనల్ చేరింది. స్వీడన్‌పై 3-0, పరాగ్వేపై 1-0, మొరాకోపై 2-0తో విజయం సాధించింది.
ఎంబాప్పే అద్భుత ఫామ్‌లో ఉండగా, జట్టు డిఫెన్స్ కూడా ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వడం లేదు.
* స్పెయిన్‌కు అసలైన పరీక్ష
ఆస్ట్రియాపై 3-0తో ప్రారంభమైన స్పెయిన్ ప్రయాణం.. పోర్చుగల్‌పై 1-0, బెల్జియంపై 2-1 విజయాలతో కొనసాగింది.
టోర్నీలో ఇప్పటివరకు ఒక్క గోల్ మాత్రమే ఇచ్చిన స్పెయిన్.. ఇప్పుడు ఫ్రాన్స్‌తో తన కఠినమైన పోరుకు సిద్ధమైంది.
* ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్ పరీక్షే
నాకౌట్ దశలో ఇంగ్లండ్‌కు ఒక్క మ్యాచ్ కూడా సులభంగా గెలవలేదు. డీఆర్ కాంగోపై 2-1, మెక్సికోపై 3-2, నార్వేపై అదనపు సమయంలో 2-1తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.
కీలక సమయాల్లో జూడ్ బెల్లింగ్‌హామ్ రాణించడం జట్టుకు పెద్ద బలంగా మారింది.
* అర్జెంటీనా దూకుడు కొనసాగుతుందా?
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్‌లో మూడు గోల్స్ చేస్తూ సెమీఫైనల్ చేరింది.
కేప్ వెర్డేపై 3-2, ఈజిప్ట్‌పై 3-2, స్విట్జర్లాండ్‌పై అదనపు సమయంలో 3-1తో గెలిచింది.
అయితే రక్షణలో కొన్ని లోపాలు కనిపిస్తుండటంతో ఇంగ్లండ్ వాటిని ఉపయోగించుకోవాలని చూస్తోంది.
* ఫైనల్‌కు చేరేది ఎవరు?
ఈసారి సెమీఫైనల్స్‌లో నాలుగు జట్లకూ ప్రత్యేక బలాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌కు కట్టుదిట్టమైన డిఫెన్స్, స్పెయిన్‌కు సాంకేతిక నైపుణ్యం, ఇంగ్లండ్‌కు పోరాట పటిమ, అర్జెంటీనాకు దూకుడైన అటాకింగ్ గేమ్ ప్రధాన ఆయుధాలు.
ఈ నాలుగు దిగ్గజాల్లో ఫైనల్‌కు చేరేది ఏ రెండు జట్లు అన్నది ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
