Raiparthy Police Jagruthi Program
* సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన
ఆకేరు న్యూస్,తొర్రుర్ డివిజన్,రాయపర్తి:
గ్రామాల్లో మరియు విద్యార్థుల్లో పెరిగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మరియు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాయపర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) వేదికగా ‘పోలీస్ జాగృతి’ బృందం చే అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ సదస్సులో పోలీస్ అధికారులు విద్యార్థులకు, స్థానికులకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పలు అసాంఘిక శక్తుల ఆగడాల గురించి, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించారు.
* సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా వేధింపులు ఎక్కువవుతున్నాయని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటిపి (OTP)లు ఎవరికీ చెప్పకూడదని పోలీస్ బృందం హెచ్చరించింది.
* డ్రగ్స్, గంజాయి మహమ్మారి..
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ రవాణా లేదా వాడకం గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
* మూఢనమ్మకాలు – భానుమతి నిరోధం..
గ్రామాల్లో ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్న మూఢనమ్మకాలు, చేతబడి, భానుమతి వంటి నమ్మకాల వల్ల అమాయకులు బలి అవుతున్నారని, సైన్స్ యుగంలో ఇలాంటి వాటిని నమ్మవద్దని ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
* గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల అణచివేత..
ఊర్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏలాంటి అసాంఘిక పనులకైనా పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
* పోలీస్ అధికారుల పిలుపు..
“విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలి. గ్రామాన్ని నేరరహిత గ్రామంగా మార్చడంలో యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలి.”
ఈ కార్యక్రమంలో ఇమ్మడి శెట్టి, నాగమణి, ఏ ఎస్ ఐ విల్లం వెంకన్న, రత్నాకర్, పూల్ సింగ్, స్లివెన్, చిరంజీవి, విక్రమ్, నారాయణ, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, రాయపర్తి పోలీస్ సిబ్బంది, పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాబృందం ఆటపాటల ద్వారా, ప్రదర్శనల ద్వారా సామాజిక అంశాలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
