Station Ghanpur Albendazole Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని గోలి రామలింగం మెమోరియల్ (జిఆర్ఎం) ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలను, కళాశాల గ్రౌండ్ ను మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ డోజర్ తో క్లీన్ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి శారద విజ్ఞప్తి మేరకు చైర్మన్ స్పందించి డోజర్ ను పంపించి కళాశాల గ్రౌండ్ ను శుభ్రం చేయించారు. అంతేకాకుండా కళాశాల విద్యార్థులకు త్రాగడానికి మినరల్ వాటర్ ను కూడా ఏర్పాటు చేయించడంతో కళాశాల పక్షాన ప్రిన్సిపాల్ పెద్దపల్లి శారద, అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థులు మున్సిపల్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
“జులై 13 “జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం” సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో “ఆల్బెండజోల్ ” మాత్రలను ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 & 2 ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి శారద, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లావణ్య అధ్యాపక అధ్యాపక ఇతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
“తాటికొండలో” జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం” సందర్భంగా మండలంలోని తాటికొండ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల తో పాటు మేధాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి జ్యోతి హై స్కూల్ హెచ్ఎం పి.వెంకటేశ్వర్లు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పి.కాత్యాయని, మేధాస్ స్కూల్ కరస్పాండెంట్ యు. మల్లేశం, వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
