Governor Justice Abdul Nazeer Visits Ap Deputy CM Pawan Kalyan
* పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
ఆకేరు న్యూస్, డెస్క్: కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
