SIR Voter Registration Telangana
* తప్పిదాలు జరగకుండా చూడాలి
-బొజ్జపల్లి సుభాష్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఓటర్ నమోదు, సవరణ లలో తప్పిదాలు జరగకుండా చూడాలని బిజెపి రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్ సూచించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం
రాజవరం చత్రపతి శివాజీ విగ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు గంటే ఉపేందర్ అధ్యక్షతన SIR ఓటర్ నమోదు కార్యక్రమం బిజెపి పార్టీ BLA లతో సమావేశ నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొజ్జపల్లి సుభాష్ బిజెపి SIR జనగామ జిల్లా కన్వీనర్ జిల్లా నాయకులు బల్ల శ్రీనివాస్ గాజుల సంపత్ కుమార్ హాజరైనారు.
ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ SIR ఓటర్ నమోదు కార్యక్రమంలోఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ ముక్కెర శ్రవణ్, శక్తికేంద్రం ఇంచార్జీ అశోక్, BLA అనిల్ , BLO రమ, భాస్కర్ లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
