Telangana MBBS Seats
అకేరు న్యూస్ డెస్క్ :జాతీయ మెడికల్ కమిషన్ (NMC) రాష్ట్రానికి భారీగా మెడికల్ సీట్లు కేటాయించింది. కొత్తగా ఏకంగా 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఈ పెంపుతో తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,250కు చేరింది. గతంలో 9,440 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 110 సీట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగంలో మొత్తం సీట్ల సంఖ్య 4,410కు చేరాయి. 30 ప్రైవేటు వైద్య కళాశాలలకు 700 కొత్త సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రైవేట్ కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 5,840కు పెరిగాయి.
