Crickets Mohammed Siraj Meets DGP CV Anand
* తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా పేసర్..
* సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
టీమిండియా స్టార్ పేసర్, తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా సేవలందిస్తున్న మహ్మద్ సిరాజ్ సోమవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
* యూనిఫామ్‌లో కనిపించిన సిరాజ్
పోలీస్ యూనిఫామ్‌లో డీజీపీ కార్యాలయానికి వచ్చిన సిరాజ్.. సీవీ ఆనంద్‌తో సమావేశమైన సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
* ‘డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ’ అంటూ అభిమానుల కామెంట్లు
సిరాజ్ యూనిఫామ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ”, “హైదరాబాద్ ప్రైడ్”, “మన సిరాజ్‌కు సెల్యూట్” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
* క్రికెట్‌తో పాటు పోలీసు బాధ్యతలు
భారత జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్న మహ్మద్ సిరాజ్.. క్రికెట్‌తో పాటు తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా తన బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా పోలీసు శాఖ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన విధులను నిర్వర్తిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
