Cheekupalli Diversion Road Inspection
* చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు రోడ్డు పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు:
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
బుధవారం వాజేడు మండలం చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు డైవర్షన్ రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రావడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు దెబ్బ తినడంతో తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి–163పై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వరద ప్రవాహం తగ్గిన అనంతరం ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్ధరించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ ఎస్పీ మనన్ భట్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కొండా కృపాకర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
