World Breastfeeding Week
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడి కేంద్రాలలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5,6,8 అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ నసీమున్నీసా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిహెచ్ ఈఓ పవిత్ర, ఐసిడిఎస్ అధికారి స్వప్న రాణిలు మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు తొలి రక్షణ అన్నారు. పాలతోపాటు అనుబంధ ఆహారాన్ని అందించాలని కోరారు. ఆకుకూరలు, పప్పు దినుసులతో ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మునిగల రాణి, మునిగల ప్రభ, సిహెచ్.సరోజ విద్యార్థులు, తల్లులు పాల్గొన్నారు.
* “శివునిపల్లిలో…
మున్సిపాలిటీ పరిధిలోని శివుని పల్లి అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీ హర్ష, డాక్టర్లు శ్రీవాణి, హెల్త్ ఎడ్యుకేటర్ మనోహర రాణి పాల్గొన్నారు. తల్లిపాలను ఏ విధంగా పట్టాలి, ఎంత వయసు వచ్చేవరకు తల్లిపాలు పట్టాలనే విషయాలను ఈ సందర్భంగా తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
