తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి.
* తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
