Dhruv Vikram and Anupama Parameswaran rumours
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన తాజా వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ గత ప్రేమ బంధం గురించి ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో.. నెటిజన్లు మాత్రం ఆ మాజీ ప్రియుడు ఎవరంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ వివాదం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ధ్రువ్ విక్రమ్ మాట్లాడారు. నటిపేరు ప్రస్తావించలేదు. కానీ తనపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చల గురించి స్పందించారు. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత విషయాలపై పరిశీలన, విమర్శలు సహజమేనని అన్నారు. జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. మనం నిజాయితీగా, మన విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు కాలక్రమేణా విమర్శలు, దుష్ప్రచారాలు తగ్గిపోతాయని వ్యాఖ్యానించారు. మన ప్రవర్తన నిజాయితీగా ఉన్నప్పుడు ఈ విమర్శలు మనల్ని ఏమీచేయలేవన్నారు.
* అనుపమ ఏం చెప్పారు?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ తన గత రెండేళ్ల జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆ బంధంలో తాను మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డానని, అవతలి వ్యక్తి తన జీవితంలోని చాలా విషయాలపై నియంత్రణ చెలాయించేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు.
* ధ్రువ్ పేరు ఎందుకు వచ్చింది?
అనుపమ, ధ్రువ్ విక్రమ్ కలిసి ‘బైసన్’ సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య గతంలో డేటింగ్ రూమర్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అనుపమ తాజా వ్యాఖ్యలు వైరల్ అయిన వెంటనే.. నెటిజన్లు ఆమె చెప్పిన మాజీ ప్రియుడు ధ్రువ్ విక్రమే అయి ఉంటాడంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
