Mulugu Vanamahotsavam
* ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.
* జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
ఆకేరు న్యూస్,ములుగు:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
