Harish Rao 22A Land Issue
* సెప్టెంబరు 7న నగరాన్ని స్తంభింపచేస్తాం
* మాజీ మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలోని పేదల నుంచి భూములను గుంజుకుని బడా పారిశ్రామికవేత్తలకు, తన తమ్ముడికి కట్టబట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల భూములు గుంజుకునే యత్నాన్ని అడ్డుకుంటామన్నారు. 100ల కోట్ల విలువ చేసే భూములు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. 22ఏలో చేర్చిన భూముల నిషేధిత జాబితాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సెప్టెంబర్ 7న అసెంబ్లీ దద్దరిల్లిపోతుందన్నారు.
* సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 22-ఏ బాధితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రజలు, రైతుల భూములను 22-ఏలో నిషేధిస్తే ప్రజలు నిన్ను నిషేధిస్తారని అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి నివాసాలుంటున్న భూములను కూడా ప్రభుత్వం కమీషన్ల కోసం 22-ఏ జాబితాలోకి చేర్చి స్ధానిక నాయకులతో కలిసి రియల్ఎస్టేట్ కమీషన్ వ్యాపారం చేస్తుందన్నారు.
* 22ఏతో వేటు
22ఏ అంటే ఒక నెంబర్ కాదు కుటుంబ భవిష్యత్లపై పడుతున్న వేటు అన్నారు. పేద ప్రజల జీవితాలతో రియల్ఎస్టేట్ వ్యాపారంచేస్తున్న పొంగులేటిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 58, 59 జీవోల ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు గురుచేశారు. ధరణిని భూతంగా చూపిన ప్రభుత్వం నేడు భూభారతీని భూమేతగా మార్చుకున్నారన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన తప్పుకు ప్రజలంతా దుఃఖానికి గురవుతున్నారన్నారు. హైడ్రా, 22ఏల దెబ్బతో హైద్రాబాద్‌లో రియల్ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. దీంతో హైద్రాబాద్ ఇమేజ్ దెబ్బతిందని హరీష్‌రావు అన్నారు.
* ప్రజలకు రక్షణ కరువు
రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, హత్యలు, అత్యాచారాలు, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి భూములకేంద్రంగానేపాలన సాగిస్తున్నాడన్నారు. నగరంలోని హౌజింగ్బోర్డుల భూములను విక్రయిస్తూ భావితరాలకు స్థలం లేకుండా చేస్తున్నారన్నారు. బాధితులకు జనతాగ్యారేజ్ ఎప్పుడు తెరిచే ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
