Ram Charan praises Ravi Teja’s Irumudi
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, తాజాగా చరణ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.
* స్వామి శరణం..
రవితేజతో పాటు ‘ఇరుముడి’ చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలను చరణ్ తెలిపారు. సినిమాకు వస్తున్న ఆదరణ, స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రవితేజతో పాటు చిత్రబృందం చేసిన కృషికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్, మైత్రీ మూవీ మేకర్స్ సహా మొత్తం టీమ్‌కు మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. చివరగా ‘స్వామి శరణం’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
* చాలా చాలా ధన్యవాదాలు సార్..
చరణ్ ప్రశంసలకు దర్శకుడు శివ నిర్వాణ కూడా స్పందించారు. “చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో చరణ్ పోస్టుకు, శివ నిర్వాణ స్పందనకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే ‘ఇరుముడి’లో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేస్తూ, చరణ్ సినిమాలో భాగం కాదని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
