Warangal Polytechnic College Police Alert
* పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
నలుగురు, ఐదుగురికి మించి విద్యార్థులు గుంపులుగా రావడాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్‌కు రానున్న నేపథ్యంలో ఆయనను మార్గమధ్యంలోనే అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు.
హరీష్ రావు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.
పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు.
దీంతో వరంగల్, హనుమకొండలో రాజకీయ, విద్యార్థి వర్గాల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.వరంగల్ కి వెళ్లకుండా హరీష్ రావు ను కూడా గృహ నిర్భంధం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
