Allu Arjun Forbes India Showstoppers 2026
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు చేరింది. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ మెరిశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్న 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో బన్నీకి చోటు దక్కడం విశేషం.
* కవర్ స్టార్‌గా బన్నీ
‘పుష్ప’ ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. ముఖ్యంగా పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ చిత్రాల విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. పుష్పరాజ్ పాత్రలో ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, స్టైల్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
* స్టార్డమ్ కంటే కథే ముఖ్యం
ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక సంచిక సందర్భంగా అల్లు అర్జున్ భారతీయ సినిమా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయంలో హీరో, హీరోయిన్ స్టార్డమ్ కంటే మంచి కథ, బలమైన కంటెంట్ కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు.
* రామ్ చరణ్ కు కూడా స్థానం
ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు రామ్‌చరణ్‌కు కూడా స్థానం లభించింది. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన ప్రముఖులతో కలిసి తెలుగు సినీ తారలు నిలవడం విశేషంగా మారింది. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనస్, రణ్వీర్ సింగ్, రజనీకాంత్, కమల్ హాసన్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
