Vijay Deverakonda Sandeep Reddy Vanga
Published:
* స్టార్ హీరో విజయ్ దేవరకొండ
* “రోమాంచకం” సినిమా ప్రీ రిలీజ్‌కు హాజరు
* సెప్టెంబర్ 3న విడుదల
అకేరు న్యూస్, హైదరాబాద్ : సందీప్ వంగా మీద తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని, రోమాంచకం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సందీప్‌రెడ్డితో తనకు బ్రదర్స్ మధ్య ఉన్న బంధం కాదు, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు.. తమ బంధం అంతకుమించిందని అన్నారు. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రసిద్ధ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “రోమాంచకం” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా యాక్టర్ కమల్ మాట్లాడుతూ – తాను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని అన్నారు. కానీ భద్రకాళీ పిక్చర్స్ ఆఫీస్ నుంచి ఈ సినిమా కోసం కాల్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీలయ్యానని చెప్పారు. అదే తన జీవితంలో మార్పునకు నాంది అని తెలిపారు. ఎందుకంటే తాను సందీప్‌కు పెద్ద అభిమానినని పేర్కొన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యాక్టర్ సతీష్ మాట్లాడుతూ – తాను నటుడిగా మారి ఇలాంటి ఒక మంచి సినిమాలో నటిస్తానని ఊహించలేదన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వర్క్ చేయాలంటూ సందీప్ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. నిజాయితీగా వందశాతం ఎఫర్ట్స్ పెట్టి మ్యూజిక్ అందించానని అన్నారు. రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ కథలో ఎంతో అర్థవంతమైన మాటలు, పాటలు రాసే సందర్భాలు ఉండటం విశేషమన్నారు. సరదా కథలోనే ఎంతో డెప్త్ ఉన్న పాటలు రాశానన్నారు. హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. తాను గతంలో “మేము ఫేమస్” సినిమా చేశానని తెలిపారు. తన క్యారెక్టర్లో ఉండే ఫన్ఆ కట్టుకుంటుదన్నారు.
* కథ చెప్పినట్లే సినిమా తీస్తావా ?
ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ .. డైరెక్టర్ వేణుగోపాల్‌ను కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా ? అని అడిగానన్నారు. ఆయన 6 నిమిషాల నిడివి గల సీన్ తీసుకొని వచ్చి చూపించినట్లు తెలిపారు. స్క్రిప్ట్‌లో ఉన్న దానికంటే ఇంకా బాగా సీన్ తెరకెక్కించినట్లు అనిపించిందన్నారు. అప్పటి నుంచి వేణుకే ఈ సినిమా బాధ్యత మొత్తం అప్పగించానన్నారు. తాను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదన్నారు. “ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలని కూడా అనుకుంటారు. అలాంటి ఫన్ సీన్స్ కూడా ఉన్నాయి” అని అన్నారు.
* అర్జున్‌రెడ్డికి యుద్ధం చేశాం..
“అర్జున్ రెడ్డి టైమ్‌లో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకుంటే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. మాకు అప్పుడు డబ్బు లేదు.. పేరు లేదు.. ఇన్ఫ్లుయెన్స్ లేదు.. “పెళ్లిచూపులు” కూడా రిలీజ్ కాలేదు.. జస్ట్ మేము ధైర్యంగా అడుగేశాం.. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, మనలో విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
“రోమాంచకం” నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, ఈ సినిమాకు సంగీత దర్శకుడు వాసుకి వైభవ్, ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా, రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
