Director Shiva Nirvana ar Maremma Trailer Launch event
* మారెమ్మ ట్రైలర్ అద్భుతంగా ఉంది
– దర్శకుడు శివ నిర్వాణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామాను మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూసిన అనంతరం ఆయన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మారెమ్మ’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, సినిమాలోని కథ, ఇంటెన్సిటీ, సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి అవసరమైన అన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయని అన్నారు.
* మాధవ్ ఎంపిక అదిరిపోయింది
మాధవ్‌తో తనకు రవితేజ ‘ఇరుముడి’ సినిమా సమయంలోనే పరిచయం ఏర్పడిందని శివ నిర్వాణ తెలిపారు. షూటింగ్ సమయంలో మాధవ్ ‘మారెమ్మ’ గురించి చెప్పారని, అప్పట్లోనే సినిమా టీజర్‌ను కూడా చూపించారని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా కొత్త హీరోలు తమ తొలి సినిమాతో పాటలు, ఫైట్లు, లవ్ స్టోరీ వంటి కమర్షియల్ అంశాలతో తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చూస్తారని శివ నిర్వాణ అన్నారు. అయితే మాధవ్ మాత్రం వాటికి భిన్నంగా కంటెంట్ బేస్డ్, ఇంటెన్స్ కథను తన తొలి సినిమాగా ఎంచుకోవడం అభినందనీయమని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథను నమ్మి మాధవ్ ఈ ప్రయత్నం చేశారని ప్రశంసించారు.
ట్రైలర్లో కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆసక్తికరంగా చూపించారని శివ నిర్వాణ అన్నారు. సినిమాలోని ఇంటెన్సిటీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. కథకు అవసరమైన అంశాలను సరిగ్గా చూపిస్తే ప్రతి సినిమా విజయం సాధించే అవకాశం ఉంటుందని, ‘మారెమ్మ’లో బ్లాక్‌బస్టర్ కావడానికి కావాల్సిన అన్ని అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. హీరోయిన్ దీప చాలా సహజంగా కనిపించారని, నిర్మాతలు కంటెంట్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించారని అన్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని కోరారు.
* రవితేజ ఎమోషనల్ అయ్యారు
హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ట్రైలర్‌ను డిజిటల్‌గా లాంచ్ చేసిన రామ్ పోతినేనికి, కార్యక్రమానికి హాజరైన శివ నిర్వాణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం కంటే భిన్నంగా ఓ మనిషికి, దున్నపోతుకు మధ్య ఉండే ప్రత్యేకమైన అనుబంధాన్ని చూపించామని మాధవ్ తెలిపారు. ఈ కథ తన దగ్గరకు తీసుకొచ్చిన నిర్మాతలకు, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. మరో ఆసక్తికర విషయాన్ని కూడా మాధవ్ వెల్లడించారు. రవితేజ ఇప్పటికే ‘మారెమ్మ’ సినిమాను చూశారని, ముఖ్యంగా క్లైమాక్స్ ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు. సినిమా చూసి రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారని తెలిపారు. రవితేజ అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. సెప్టెంబర్ 10న ప్రేక్షకులు తమకు మద్దతు ఇస్తే కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటామని అన్నారు.
* ట్రైలర్ కంటే పదిరెట్లు ఉంటుంది
దర్శకుడు మంచాల నాగరాజ్ మాట్లాడుతూ.. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్రైలర్ కంటే పదిరెట్లు సినిమా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని అన్నారు. ‘మారెమ్మ’ ప్రతి గ్రామంలో కనిపించే మనుషులు, మన సంస్కృతి, మన జీవితాలకు దగ్గరగా ఉండే కథ అని నాగరాజ్ తెలిపారు. మన ఊరిలో జరిగిన కథను చూస్తున్న అనుభూతిని సినిమా కలిగిస్తుందని, తెలంగాణ పల్లె సంస్కృతిని తెరపై ప్రత్యేకంగా చూపించామని చెప్పారు. ప్రేక్షకులకు ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
* తెలంగాణ పల్లెటూరి కథతో ‘మారెమ్మ’
నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ.. ట్రైలర్‌ను లాంచ్ చేసిన శివ నిర్వాణ, డిజిటల్‌గా విడుదల చేసిన రామ్ పోతినేనికి ధన్యవాదాలు తెలిపారు. ‘మారెమ్మ’ పూర్తిగా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని చెప్పారు. కొత్త హీరోలు సాధారణంగా యాక్షన్ లేదా లవ్ స్టోరీలను ఎంచుకునే సమయంలో మాధవ్ మాత్రం ఇలాంటి ఇంటెన్స్ కథను తన తొలి సినిమాగా ఎంచుకోవడం సాహసమేనని నిర్మాత అన్నారు. మాధవ్ హార్డ్ వర్క్‌ను ప్రశంసించారు. హీరోయిన్ దీప కూడా తెలుగు అమ్మాయిలా సహజంగా కనిపిస్తారని, సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నటుడు వికాస్ వశిష్ట తెలిపారు. ట్రైలర్ అదిరిపోయిందని, సినిమా మరింత దద్దరిల్లిపోతుందని అన్నారు. నిర్మాతలకు సినిమాపై ఉన్న ప్యాషన్‌ను ప్రశంసిస్తూ.. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరమని చెప్పారు.
* గ్రామీణ నేపథ్యం, యాక్షన్, ఎమోషన్
‘మారెమ్మ’లో మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపా లక్ష్మి తదితరులు నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్‌తో సాగే కథగా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చారు. దేవ్ రాథోడ్ ఎడిటర్‌గా, రాజ్ కుమార్ మురుగేషన్ ఆర్ట్ డైరెక్టర్‌గా, మాడిగొండ నటరాజ్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు.
మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్లో కనిపించిన ఇంటెన్సిటీ, పల్లెటూరి వాతావరణం, యాక్షన్, ఎమోషన్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
