Palakurthi Congress 1000 Days Rally
* నియోజకవర్గవ్యాప్తంగా రికార్డు స్థాయిలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ఆకేరు న్యూస్,పాలకుర్తి:
పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల విజయవంతమైన “ప్రజాపాలన”ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో గురువారం నాడ భారీ బైక్ ర్యాలీలు, సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూర్ మరియు రాయపర్తి మండల కేంద్రాలలో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, కార్యకర్తల కోలాహలంతో వాతావరణం పండుగలా మారింది. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వేలాదిమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు యువత తమ ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మండల ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులతో రహదారులన్నీ జనసందోహంతో నిండిపోయాయి.
* మండలాల వారీగా సాగిన విశేషాలు..
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలో ఊరేగింపుగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రజాపాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేవరుప్పుల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో భారీ ప్రదర్శన నిర్వహించి, ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు పొందుతున్న అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొడకండ్లలో జరిగిన ర్యాలీలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆదరణ స్పష్టంగా కనిపించిందని నాయకులు పేర్కొన్నారు. పెద్దవంగర మండల పరిధిలో కాంగ్రెస్ శ్రేణులు పచ్చని జెండాలు చేతబూని ఊరేగింపుగా సాగుతూ, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని కొనియాడారు. తొర్రూర్ పురపాలక, మండల పరిధిలో నిర్వహించిన బైక్ ర్యాలీ నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది ద్విచక్ర వాహనాలతో సాగిన ఊరేగింపుతో ప్రధాన రహదారులన్నీ కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తాయి. రాయపర్తి మండల కేంద్రంలోనూ భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజాపాలన 1000 రోజుల విజయాలను చాటిచెప్పారు.
* అభివృద్ధి-సంక్షేమాలే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన
ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 1000 రోజులలో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించామని పేర్కొన్నారు. రైతు రుణాలు, మహాలక్ష్మి పథకం, ఉచిత విద్యుత్, గృహజ్యోతి, చేయూత పింఛన్లు మరియు ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శక పాలన అందించామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పాలకుర్తి ప్రాంతాన్ని నేడు సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ 1000 రోజుల విజయవంతమైన ప్రజాపాలనకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతే ప్రత్యక్ష నిదర్శనమని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాలలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ ప్రతినిధులు, మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
