Konda Surekha Key Decision
* సురేఖ సంచలన ప్రకటన
* కొండా అడుగులు ఎటు వైపు ?
* త్వరలో కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, వరంగల్ : మాజీ మంత్రి కొండా సురేఖ మరోసారి సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని పెంచేలా ఆమె స్పందించారు.
* ప్రకటన.. ప్రాధాన్యం..
త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా” అంటూ కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పదవి నుంచి తొలగింపునకు గురైన తర్వాత కొండా సురేఖ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఇప్పటికే అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
* కొత్త నిర్ణయం..
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ తదుపరి అడుగుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా..? లేక రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ విమర్శలు చేశారు. మరోవైపు ఆమెకు మద్దతుగా కొందరు నాయకులు, అనుచరులు కూడా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో “త్వరలో కీలక నిర్ణయం” అంటూ కొండా సురేఖ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను మరింత పెంచింది. కొండా సురేఖ ప్రకటించబోయే నిర్ణయం కేవలం ఆమె వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకే పరిమితం అవుతుందా..? లేక ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందా..? అన్న చర్చ మొదలైంది. ఆమె కీలక నిర్ణయం ఏమిటన్నది త్వరలోనే తేలనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
