Free Cancer Screening Camp in Thorrur
* తొర్రూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 6న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరం
ఆకేరు న్యూస్,తొర్రూరు:
తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని లయన్స్ భవన్ లో తొర్రూర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ , రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో డాక్టర్ నాళ్ల ప్రత్యూష పర్యవేక్షణలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తొర్రూరు లయన్స్ క్లబ్ ప్రతినిధి, తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండలశాఖ అసోసియేట్ అధ్యక్షుడు మన్నూరు కోటయ్య, ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
డివిజన్ కేంద్రంలోని లయన్స్ భవన్ లో ఆదివారం ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఈ క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరంలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్ వ్యాధులకు ప్రముఖ వైద్య నిపుణులచే అత్యాధునిక వైద్య పరికరాలతో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కోటయ్య ఈ ప్రకటనలో తెలిపారు. తొర్రూరు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ క్యాన్సర్ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తొర్రూరు మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అవసరమైన మందులు ఉచితంగా అందచేయనున్నట్లు కోటయ్య ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ క్యాన్సర్ నిర్ధారణ వైద్య వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సుధాకర్ రెడ్డి, లైన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
