Eshwar Rachi Raju Horror Movie
* శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ కొత్త చిత్రం ప్రారంభం
* హీరోగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చుట్టాలబ్బాయ్’, ‘హైవే’ వంటి చిత్రాలను నిర్మించిన వెంకట్ తలారి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ రాచి రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నందిత, లిఖిత హీరోయిన్లుగా కనిపించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
* హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం
ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి క్లాప్ ఇవ్వడంతో పాటు దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
* విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్
గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరికొత్త కథ, కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా వినూత్నంగా ఉండి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, విడుదల తేదీ తదితర ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. చిత్రంలో ఈశ్వర్ రాచి రాజు, నందిత, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక బృందంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విప్లవ్ ఎన్, యాక్షన్ కొరియోగ్రఫీ దిలీప్, ఎడిటింగ్ శ్రీధర్, వి.బి.జె, సంగీతం సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి మాసం నిర్వహిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
