Comrade Kalyan R Narayana Murthy
* ‘కామ్రేడ్’ పదంపై సెన్సార్ అభ్యంతరం ధర్మం కాదు
– టీజర్ విడుదల కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి
ఆకేరు న్యూస్, డెస్క్: ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న పీరియడ్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. హ్యూమర్, రొమాన్స్, ఎమోషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన ఈ సినిమా కథ 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది.
* థియేటర్ ఓనర్‌గా శ్రీ విష్ణు
సినిమాలో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్‌గా కనిపించనున్నారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి ఆయన వీరాభిమాని. ఆయన సినిమాలనే తన థియేటర్లో ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. అతడి జీవితంలోకి ఓ ఒడియా అమ్మాయి ప్రవేశించడంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకుంటాయి. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారి.. చివరకు అతడిని నక్సలిజం వైపు నడిపించే పరిస్థితులు ఏర్పడతాయి. టీజర్లో వినోదం, ప్రేమతో పాటు కథలోని ఎమోషనల్ అంశాలను కూడా చూపించారు.
* సెన్సార్‌పై ఆర్. నారాయణమూర్తి వ్యాఖ్యలు
టీజర్ విడుదల కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారని అన్నారు. అయితే సెన్సార్ అధికారులు ‘కామ్రేడ్’ అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తాను విన్నానని తెలిపారు. సినిమా అనేది ఎంతో మంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ అని, సెన్సార్ పేరుతో చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టడం ధర్మం కాదని అన్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
టీజర్ తనకు నచ్చిందని చెప్పిన ఆర్. నారాయణమూర్తి.. ఇందులో మంచి వినోదం, ప్రేమ కనిపిస్తున్నాయని అన్నారు. దర్శకుడు జానకిరామ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
* అక్టోబర్ 9న విడుదల
ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకులు బాబీ, శివ నిర్వాణ, నందిని రెడ్డి, బీవీఎస్ రవి, వీఎన్ ఆదిత్య, దర్శకుడు జానకిరామ్, నిర్మాత కోన వెంకట్, నిర్మాత వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
