Station Ghanpur Road Accident
Station Ghanpur Road Accident: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన శివరాత్రి వెంకటేశ్వర్లు (మృతి) చెందారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చిన ఆయన సోమవారం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద TG 32 0020 నంబర్ గల ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతుండగా, AP 13 AC 5677 నంబర్ గల కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య శివరాత్రి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై వినయ్ కుమార్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
