KCR Farmhouse
* ఉందని తేలితే ఎస్సీలకు పంచుతాం
* చట్టప్రకారం చర్యలు.. కక్షసాధింపు లేదు..
* నా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది గత ప్రభుత్వమే
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ చీఫ్ ఫాంహౌస్ భూమిలో ప్రభుత్వ భూమి ఉందని సమాచారం ఉందని, ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే ఎస్సీలకు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో పొంగులేటి మాట్లాడారు. కేసీఆర్ భూమికి సంబంధించి సర్వే చేస్తామని, తర్వాత సాంకేతిక ఆధారాలతో అన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు. ఎస్సీలు ఫామ్ హౌస్ కి వెళ్తే పసుపు నీళ్లు చల్లారని విమర్శించారు. అలాంటి వారికి ఎస్పీలపై ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
* దోచుకున్న భూమిలో ఇందిరమ్మ టవర్స్
తమ ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలకూ పాల్పడడం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. హరీష్ రావు చేసింది పక్కా మోసమని అన్నారు. వాళ్ళ మామ కొన్నట్టు చెబుతున్న డాక్యుమెంట్లు బోగస్ అని ఆరోపించారు. రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు దోపిడీ చేశారని విమర్శించారు. హరీష్ రావు దోచుకున్న భూమిలో ఇందిరమ్మ టవర్స్ కడతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
* వందల కోట్లు ఎక్కడివి?
ప్రభుత్వం భూమిలో కేసీఆర్ తిష్ట వేశారని పొంగులేటి ఆరోపించారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇబ్బంది లేదు కానీ, సర్వే చేసి ఎక్కువ తక్కువ ఉంటే కేసీఆర్ కు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒరిజినల్ జమిందార్ అయితే 2004లో భూమి ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. ఒక ఎకరం ఉందని అప్పుడు కేసీఆర్ చూపించారని తెలిపారు. ఒరిజినల్ పట్టాలు ఉన్న వారిని ఇబ్బంది పెట్టబోమని వెల్లడించారు. దళితులకు గిరిజనులకు సంఘీభావం చెప్పడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్తారని అన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అసెంబ్లీలో సీఎం రేవంత్ చర్చించినట్లు వెల్లడించారు. ఎకరం భూమిలేని వారికి వందల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.
* నాకైనా శిక్ష పడాల్సిందే..
వట్టి నాగులపల్లి భూమి నాది కాదని, లీజుకు తీసుకొని డెవలప్ చేస్తున్నారని హరీష్ రావు అంటున్నారని, అయితే అప్పుడే ఎందుకు చూపిందలేదని అన్నారు. లెక్కల్లో చూపిన భూమి కన్నా.. ఒక గుంట ఎక్కువ ఉన్న ప్రభుత్వానిదే అని తెలిపారు. నేను తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు. నా ప్రాజెక్టులకు అనుమతించింది గత ప్రభుత్వమే అని, హోల్డ్ చేసిందీ ఆ ప్రభుత్వమే అన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తాను వ్యాపారంలో ఉన్నాను అని తెలిపారు. డిఫెన్స్ లో గ్రోత్ ఉంది కాబట్టే ఆ రంగంలోకి వెళ్ళామన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
