Danam Nagender Disqualification
* హైకోర్టు సంచలన తీర్పు
Danam Nagender Disqualification: ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై రాష్ట్ర హైకోర్ట్ అనర్హత వేటు వేసింది.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమి పాలయిన తర్వాత తిరిగి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు..
అనర్హత కేసు ..
దానం నాగేందర్ పార్టీ మారినందున అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ ఆ పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించగా, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడం మరియు ఇతర పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూ కోర్టులో ఈ పిటిషన్లపై తీవ్ర వాదనలు జరిగాయి. అనంతరం స్పీకర్ ఆదేశాలపై హైకోర్టు స్టే విదించింది.. సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ఈ ఆర్డర్ పై స్టే ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది

Please tell us what is wrong. Your report will be sent to the website team.
