Raiparthy
* విద్యుత్ షాక్తో రైతు మృతి
ఆకేరు న్యూస్,రాయపర్తి : మండలంలోని వాంకుడోత్ తండాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన వాంకుడోత్ రామ్ దాన్, (రైతు) ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి (కరంట్ షాక్) గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల సమయంలో రామ్ డాన్, తన పొలంలో పైరుకు నీరు పెట్టేందుకు స్టార్టర్ వేసేందుకు (ఇంజన్ పెట్టే క్రమంలో) వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పొలానికి నీరు పెట్టి వస్తానని చెప్పి పోయిన వ్యక్తి ఆరు గంటల వరకు రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ కు స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు పొలంవద్దకు వెళ్లి చూడగా కరెంటు షాక్ గురై మృతి చెందినట్లుగా గుర్తించి కన్నీటి పర్వ మయ్యారు.
ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుము కున్నాయి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటను కాపాడుకునేందుకు వెళ్లి, కుటుంబానికి ఆధారమైన రైతు శవమై తేలడంతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతి చెందిన రామ్ ధాను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించి రాంధన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
