Mulugu Collector Borkhade Hemanth Sahadev rao
Mulugu Collector: ఆకేరు న్యూస్, ములుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ములుగు ఆర్డీవో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీవోలు, మండల స్థాయిలో సంబంధిత అధికారులు ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
