Kakatiya Kala Thoranam
Kakatiya Kala Thoranam| ఆకేరు న్యూస్, కమలాపూర్: తెలంగాణ చరిత్ర, కళా వైభవానికి ప్రతీకగా నిలిచే కాకతీయ కళా తోరణం ప్రధానమంత్రి మెమెంటోస్ ఈ-వేలం–2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతదేశ సమృద్ధమైన కళ, సంస్కృతి, వారసత్వానికి గౌరవప్రదమైన చిహ్నంగా కాకతీయ కళా తోరణాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రస్తావించింది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2026 వరకు నిర్వహిస్తున్న ఈ-వేలంలో కాకతీయ కళా తోరణాన్ని కూడా చేర్చినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ శిల్పకళా రూపాన్ని వ్యక్తిగత సేకరణలో భాగం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం చేస్తోంది.
ఈ సందర్భంగా #PMMementosEAuction2026, #CultureUnitesAll హ్యాష్‌ట్యాగ్‌లతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. కాకతీయుల కళా సంపదకు గుర్తుగా నిలిచిన ఈ తోరణం జాతీయ స్థాయి మెమెంటోస్ ఈ-వేలంలో చోటు దక్కించుకోవడం తెలంగాణ వారసత్వానికి ప్రాధాన్యం లభించిన అంశంగా నిలిచింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
