Hyderabad Protest
Hyderabad Protest| ఆకేరు న్యూస్, హైదరాబాద్: సెన్సస్–2027లో ఓబీసీల జనాభా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు OBC కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్‌పార్క్‌లో నిరసన ధర్నా నిర్వహించనున్నారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ (BCIF), బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఆల్ ఇండియా ఓబీసీ పొలిటికల్ రిప్రజెంటేటీవ్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓబీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై సమగ్ర విధాన నిర్ణయాలకు కులాల వారీగా జనాభా గణన అవసరమని వారు పేర్కొన్నారు.
సెన్సస్‌లో ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలను శాస్త్రీయంగా నమోదు చేయడంతో పాటు, భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి, ప్రాతినిధ్య విధానాలకు ఉపయోగపడేలా OBCలకు ప్రత్యేక కాలమ్ చేర్చాలని డిమాండ్ చేశారు.
ధర్నాకు బీసీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, బీసీ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
