Mulugu
* భూమి కోసం వేధింపుల ఆరోపణలు
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల గర్భిణీ పురుగుమందు సేవించి మృతి చెందింది. అదనపు కట్నం, భూమి విషయంలో భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రోయ్యూరు గ్రామానికి చెందిన స్వర్ణలత (25) హరీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం స్వర్ణలత నాలుగు నెలల గర్భిణీగా ఉంది.
కొంతకాలంగా అదనపు కట్నం, భూమి విషయంలో కుటుంబంలో వివాదాలు ఉన్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వేధింపులు భరించలేక స్వర్ణలత పురుగుమందు సేవించినట్లు వారు పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఏటూరునాగారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ మహేశ్ తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
