NTR
* మహిళలను అవమానించేలా వీడియో..
* తీవ్రంగా ఖండించిన హీరో
NTR| ఆకేరు న్యూస్, డెస్క్: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అవమానకరంగా వీడియో రూపొందించడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా కృత్రిమ మేధస్సును ఉపయోగించడం అత్యంత దారుణమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
AI టెక్నాలజీని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా కంటెంట్ రూపొందిస్తున్నారని ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించకూడదని స్పష్టం చేశారు.
చర్యలు తీసుకోవాలి
మహిళలను అవమానించేలా రూపొందించిన మార్ఫింగ్ వీడియోలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. AI సాంకేతికతను దుర్వినియోగం చేసే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరారు.
సాంకేతికతను సృజనాత్మక, నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సి ఉండగా.. వ్యక్తుల ప్రతిష్ఠ, గౌరవాన్ని దెబ్బతీసేలా వినియోగించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
