Jitin Gulati
Jithin Gulati| ఆకేరు న్యూస్, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో జితిన్ గులాటి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్‌తో తన తొలి పరిచయం, సినిమాలో అవకాశం వచ్చిన విధానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తొలి చూపులోనే బాహుబలి..
‘ఫౌజీ’ షూటింగ్ సెట్లో ప్రభాస్‌ను తొలిసారి చూసినప్పుడు ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి గుర్తొచ్చాడని జితిన్ గులాటి తెలిపారు. వానిటీ నుంచి సెట్లోకి ప్రభాస్ నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆయనలో ప్రత్యేకమైన ఆరా కనిపించిందని చెప్పారు. అంతకుముందు ప్రభాస్‌ను వ్యక్తిగతంగా కలవకపోవడంతో.. ఆయనను చూడగానే అమరేంద్ర బాహుబలి సెట్లోకి వచ్చినట్టుగా అనిపించిందని జితిన్ పేర్కొన్నారు.
స్టార్డమ్కు దూరంగా..
ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను పట్టించుకోకుండా చాలా సాధారణంగా, సింపుల్‌గా ఉంటారని జితిన్ ప్రశంసించారు. చుట్టూ ఉన్నవారే ఆయన స్టార్‌డమ్‌ను ఎక్కువగా ఫీల్ అవుతారని, ప్రభాస్ మాత్రం ఆ భారం ఏ మాత్రం మోసుకెళ్లరని అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు.
10 నిమిషాల్లోనే ఛాన్స్
‘ఫౌజీ’లో తనకు అవకాశం వచ్చిన విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉందని జితిన్ తెలిపారు. దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన ఫొటోలు దర్శకుడు హను రాఘవపూడికి చేరాయని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు హను రాఘవపూడిని కలవగా.. కేవలం 10 నిమిషాల్లోనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారని జితిన్ వెల్లడించారు. ఇంత వేగంగా సినిమా అవకాశం రావడం తనకు ఇదే తొలిసారి అని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
