Sai Pallavi
Sai Pallavi| ఆకేరు న్యూస్, సినిమా: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అభిమానులకు వరుస సినిమాలతో డబుల్ ట్రీట్ లభించనుంది. ‘తండేల్’ తర్వాత వరుసగా సినిమాలు చేయకుండా తన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకటి బాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ కాగా.. మరొకటి ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓమ్’.
రెండు వారాల గ్యాప్‌లోనే..
‘రామాయణం పార్ట్ వన్’ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరోవైపు ధనుష్ హీరోగా రూపొందుతున్న ‘ఓమ్’ నవంబర్ 20న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
రెండు చిత్రాల్లోనూ భిన్న పాత్రలు
ఈ రెండు సినిమాల్లోనూ సాయిపల్లవి సాధారణ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఆమె కనిపించనుండటంతో.. ఈ చిత్రాలు ఆమె కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ‘ఓమ్’లో శ్రీలీల, మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరో క్రేజీ ప్రాజెక్ట్
ఇక వచ్చే ఏడాది సాయిపల్లవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించనున్నట్లు సమాచారం. దీంతో సాయిపల్లవి వరుసగా వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
